BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 01 August 2026, 07:48 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆరుగొలనుపేట గ్రామంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి విశేష స్పందన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 07:48 AM
51 వీక్షణలు

ఆరుగొలనుపేట గ్రామంలో ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి విశేష స్పందన

  • కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన టీడీపీ నాయకులు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం ఆరుగొలనుపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో "ఇంటింటికీ టీడీపీ" కార్యక్రమాన్ని గ్రామ పార్టీ అధ్యక్షుడు పానుగళ్ళ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పానుగళ్ళ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పారదర్శక పాలన అందిస్తోందన్నారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులు, పేద కుటుంబాల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ రహదారులు, తాగునీటి సౌకర్యాలు, విద్య, వైద్యం, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం, పంటలకు గిట్టుబాటు ధర, వ్యవసాయ రంగ బలోపేతానికి ప్రత్యేక చర్యలు చేపడుతుండగా, మహిళల ఆర్థిక సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు.

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ, గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.