BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 15 September 2026, 07:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆరుగోలనుపేటలో ఘనంగా అన్నసమారాధన.. భక్తుల సందడి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Sep, 2026 - 07:14 PM
39 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం ఆరుగోలనుపేట గ్రామంలోని గౌడ్ బజార్‌లో వినాయక నవరాత్రుల సందర్భంగా శ్రీ బాల గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నసమారాధన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వినాయకుడి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ అన్నసమారాధనకు భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 2,000 మందికి కమిటీ సభ్యులు అన్నప్రసాదాన్ని అందించారు. భక్తిశ్రద్ధలతో సాగిన అన్నసమారాధనతో గౌడ్ బజార్‌ ప్రాంతం సందడిగా మారింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నప్రసాదాన్ని అందించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చాట్రాయి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వినాయక నవరాత్రుల సందర్భంగా అన్నసమారాధన నిర్వహించడం ఆనందంగా ఉందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.