BREAKING
thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● మర్రిగూడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు
Date of Publish : 23 May 2026, 10:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆస్తుల కోసం కన్నతండ్రినే బయటకు పంపించిన కుటుంబం..!

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 May, 2026 - 10:17 PM
218 వీక్షణలు

ఆస్తుల కోసం కన్నతండ్రినే బయటకు పంపించిన కుటుంబం..!

వృద్ధుడి దయనీయ స్థితి చూసి స్పందించిన స్థానికులు

చాకచక్యంగా స్పందించిన మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్

మంగళగిరి మండలం నవులూరు గ్రామ పరిధిలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. పశువుల ఆస్పత్రి సమీపంలో అవ్వారు నాగేశ్వరరావు అనే వృద్ధుడు నిరాశ్రయ స్థితిలో ఒంటరిగా కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆకలితో, ఆవేదనతో అక్కడే కూర్చున్న వృద్ధుడిని గమనించిన సచివాలయ పోలీసు సిబ్బంది, నవులూరు టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ నజీర్ వెంటనే మంగళగిరి గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న మంగళగిరి గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని వృద్ధుడితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు ఆస్తులన్నీ తమ పేర్లకు రాయించుకుని అనంతరం ఇంటి నుంచి బయటకు పంపించినట్లు నాగేశ్వరరావు తెలిపినట్టు సమాచారం.

ఈ విషయంపై స్పందించిన ఎస్సై వెంకట్ కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. వృద్ధులను చూసుకోవడం కుటుంబ సభ్యుల బాధ్యత అని, ఆస్తుల కోసం వారిని వేధించడం అమానుషమని హెచ్చరించారు. అనంతరం నాగేశ్వరరావును సురక్షితంగా తిరిగి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు.

ఈ సందర్భంగా ఎస్సై వెంకట్ మాట్లాడుతూ…

“వృద్ధులను నిర్లక్ష్యం చేయడం సమాజానికి మంచిది కాదు. తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోవాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కుటుంబ సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలి” అని సూచించారు.