BREAKING
thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● బ్లాక్ డేగా కాంగ్రెస్ నిరసన.. నారాయణపురంలో పార్టీ శ్రేణుల ఆందోళన thumb ● ఐదు నెలలుగా జీతాలు లేవు.. వెంటనే చెల్లించాలని వినతి thumb ● రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌ఓగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన
Date of Publish : 07 July 2026, 09:48 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో ఆటో డ్రైవర్లకు ఎస్సై రాజు కౌన్సెలింగ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 09:48 PM
116 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు, జూలై 7: పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధతతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తిరువూరు సెక్టర్-2 ఎస్సై రాజు సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆటో డ్రైవర్లతో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, రాష్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ప్రయాణికుల భద్రతే ప్రతి డ్రైవర్‌ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

ప్రజల భద్రతకు ప్రతి ఒక్కరూ భాగస్వాములని, చిన్న సమాచారం కూడా పెద్ద నేరాలను అరికట్టడంలో కీలకంగా మారుతుందని ఎస్సై రాజు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.