BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 07 July 2026, 08:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీ హస్తకళా మహోత్సవానికి ఘన ప్రారంభం డిప్యూటీ సీఎం పవన్‌కు స్వాగతం పలికిన ఎంపీ కేశినేని చిన్ని

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 08:38 PM
116 వీక్షణలు

విజయవాడ అంబేద్కర్ కళావేదికలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  హాజరై మహోత్సవాన్ని ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రికి విజయవాడ పార్లమెంట్ సభ్యుడు  ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి , ఎంపీ కేశినేని చిన్ని, ఆంధ్రప్రదేశ్ హస్తకళ నైపుణ్య అభివృద్ధి సంస్థ చైర్మన్ , జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ హస్తకళా స్టాల్స్‌ను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, లేపాక్షి హస్తకళా మహోత్సవం రాష్ట్ర హస్తకళా వారసత్వం, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. రాష్ట్రంలోని వేలాది మంది కళాకారుల జీవనోపాధికి లేపాక్షి బలమైన ఆధారంగా ఉందని పేర్కొన్నారు. హస్తకళలను ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యంలోకి తీసుకువెళ్లడం, లేపాక్షి బ్రాండ్‌ను బలోపేతం చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

సంప్రదాయ హస్తకళలను పరిరక్షిస్తూనే ఆధునిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వాటిని అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన చెప్పారు. ఈ-కామర్స్ వేదికల ద్వారా హస్తకళల విక్రయాలను విస్తరించేందుకు ప్రత్యేక కార్యాచరణ కొనసాగుతోందని వెల్లడించారు.

అలాగే, కొండపల్లి బొమ్మల ప్రత్యేకతను ప్రపంచానికి చాటే విధంగా వాటి బ్రాండింగ్‌ను మరింత పెంచాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేసినట్లు ఎంపీ చిన్ని తెలిపారు. కొండపల్లి హస్తకళల భౌగోళిక గుర్తింపును పరిరక్షించేందుకు, నకిలీల నివారణకు, అంతర్జాతీయ మార్కెటింగ్‌కు అనువుగా జియో ట్యాగింగ్ సౌకర్యం తీసుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు ఐఏఎస్ అధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, హస్తకళాకారులు మరియు కళాప్రేమికులు పాల్గొన్నారు.