BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 07 July 2026, 08:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బాలికల క్రికెట్ టోర్నమెంట్‌కు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు శ్రీకారం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 08:38 PM
108 వీక్షణలు

మైలవరం, జూలై 7: ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని ఎస్‌ఎస్‌కే పబ్లిక్ స్కూల్‌లో నిర్వహిస్తున్న బాలికల క్రికెట్ టోర్నమెంట్‌ను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మంగళవారం ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి టోర్నమెంట్‌ను ప్రారంభించి, విద్యార్థినులకు శుభాకాంక్షలు తెలిపారు. బాలికల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల సమగ్ర వికాసానికి ఎంతో అవసరమన్నారు. నేటి పరిస్థితుల్లో బాలికలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, క్రీడల్లోనూ ప్రతిభ కనబర్చి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులకు ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని, నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం క్రికెట్ మైదానంలోకి వెళ్లిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు బ్యాటింగ్ చేసి టోర్నమెంట్‌కు శ్రీకారం చుట్టగా, విద్యార్థినులు, ఉపాధ్యాయులు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, క్రీడా నిర్వాహకులు, తల్లిదండ్రులు, విద్యార్థినులు పాల్గొన్నారు.