BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 08 July 2026, 09:34 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కడప జిల్లాలో విషాదం.. విద్యుత్ స్తంభం విరిగి వృద్ధ దంపతుల దుర్మరణం

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 09:34 AM
125 వీక్షణలు

కడప జిల్లా మైదుకూరులో బుధవారం తెల్లవారుజామున హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఆకుల వీధిలో నివసిస్తున్న పందిటి నడిపి సుబ్బరాయుడు (85), ఓబులమ్మ (75) దంపతులు విద్యుత్ స్తంభం విరిగి తమపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు.

స్థానికుల వివరాల ప్రకారం, వరి పొట్టు లోడుతో వెళ్తున్న లారీ విద్యుత్ తీగలను తగలడంతో విద్యుత్ స్తంభం ఒక్కసారిగా విరిగి పడింది. ఆ సమయంలో తమ ఇంటి ముందు నిద్రిస్తున్న వృద్ధ దంపతులపై స్తంభం పడటంతో వారు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనతో మైదుకూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ, డ్రైవర్‌పై చర్యలు తీసుకునే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది.