ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ప్రమాదం.. ఇద్దరు విద్యార్థినులకు గాయాలు
తెలంగాణ
/
ఖమ్మం
- ఖమ్మం జిల్లా బోనకల్ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో ఘటన
- తొమ్మిదో తరగతి గదిలో ఊడిపడిన స్లాబ్ పెచ్చులు
ఖమ్మం జిల్లా, బోనకల్: ప్రభుత్వ పాఠశాలల భవనాల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. బోనకల్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో స్లాబ్ పెచ్చులు ఊడిపడి ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు.
పాఠశాలలోని తొమ్మిదో తరగతి గదిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పైకప్పు నుంచి స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో పూజిత, కీర్తన అనే ఇద్దరు విద్యార్థినులకు గాయాలయ్యాయి.
విద్యార్థినులు చదువుకునే తరగతి గదిలోనే ఈ ప్రమాదం జరగడంతో పాఠశాల భవనాల నిర్వహణ, భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల ప్రాణాలకు ముప్పు కలగకుండా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల భవనాలను అధికారులు తనిఖీ చేసి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.