BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 12 August 2025, 08:03 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

మండలంలో ఉన్న టైర్ల కంపెనీలపై చర్యలు తీసుకోవాలి

తెలంగాణ
12 Aug, 2025 - 08:03 PM
532 వీక్షణలు
మండలంలో ఉన్న టైర్ల కంపెనీలపై చర్యలు తీసుకోవాలి-- భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్ పైలెట్ NTODAY NEWS: బొమ్మలరామారం. యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, రంగాపురం గ్రామ రెవిన్యూ పరిధిలో ఉన్న టైర్ల కంపెనీలపై క్షేత్ర తనిఖీ నిర్వహించి చర్యలు తీసుకోవాలని మంగళవారం రోజున మండల తాహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా రాజేష్ పైలెట్ మాట్లాడుతూ మండలంలోని రంగాపురం గ్రామంలో పనిచేస్తున్న టైర్ పైరోలైసిస్ ఫ్యాక్టరీలు N&N ఇండస్ట్రీస్, గణపతి ఇండస్ట్రీస్ మరియు రైజింగ్ సన్ ఇండస్ట్రీస్ వల్ల వ్యవసాయ భూములకు తీవ్ర కాలుష్యాన్ని కలిగిస్తున్నాయన్నారు ఈ ఫ్యాక్టరీలు వ్యవసాయ భూముల మధ్యలో స్థాపించబడ్డాయి అని, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నిబంధనలు మరియు CPCB మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ, పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఇలాంటి టైర్ల కంపెనీలు పారిశ్రామిక ప్రాంతాలలో మాత్రమే ఉండాలని ప్రభుత్వ మార్గదర్శకాలు ఉన్నాయని అన్నారు. టైర్ల కంపెనీ నుండి వెలబడే విషవాయు కాలుష్యం, నల్ల బూడిదతో వ్యవసాయ భూములు సాగుకు పనికి రాకుండా పోతున్నాయని అన్నారు టైర్లు కాల్చినప్పుడు వెలుబడే సల్ఫైడ్ మరియు ఇతర విష వాయువుల వలన రైతులకు కార్మికులకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు విషపూరిత కాలుష్యం వలన పంటలు, పశుగ్రాసం వ్యవసాయ భూములను కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు విష కాలుష్యం వలన ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి అని అన్నారు ఇలాంటి కంపెనీలు పారిశ్రామిక ప్రాంతాలలో కాకుండా వ్యవసాయ భూములలో ఉండటం ద్వారా పర్యావరణ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయి అని అన్నారు. ఈ కంపెనీల వల్ల కాలుష్యం మరియు నష్టం యొక్క పరిధిని ప్రత్యక్షంగా చూడటానికి ప్రభావిత వ్యవసాయ ప్రాంతాల క్షేత్ర తనిఖీని నిర్వహించండి అని తాహసిల్దారును కోరామని తెలిపారు ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి వ్యవసాయ భూములకు హాని కలిగించే టైర్ల కంపెనీలు వెంటనే మూసివేయాలని అని అన్నారు. Follow us on Website Facebook Instagram YouTube