BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 17 April 2026, 07:49 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
17 Apr, 2026 - 07:49 PM
169 వీక్షణలు

చిత్తూరు జిల్లా శంఖంపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రావణ్ కుమార్ (24) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు.

వివరాల ప్రకారం, మృతుడి బంధువైన కాశీ నంద చౌదరికి చెందిన మామిడి తోటలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు శ్రావణ్ కుమార్ అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో తోట పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో అడవి జంతువులను పట్టుకునేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల ఉచ్చులో చిక్కుకున్నాడు.

విద్యుత్ తీగలు తగిలి తీవ్ర షాక్‌కు గురైన శ్రావణ్ కుమార్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనపై మృతుడి తమ్ముడు తరుణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పాకాల సీఐ చిన్న గోవిందు దర్యాప్తు ప్రారంభించారు. అడవి జంతువుల కోసం విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.