ఏఐఎస్ఎఫ్ మధిర మండల అధ్యక్ష కార్యదర్శులుగా నందిపాటి వెంకటేశ్వర్లు, కళ్లెం అశోక్
మధిర: అఖిల భారత విద్యార్థి సమాఖ్య మధిర మండల మహాసభలు గురువారం మధిర పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 30 మంది విద్యార్థులతో నూతన మధిర మండల కౌన్సిల్‌ను ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ ప్రకటించారు.
నూతన మధిర మండల అధ్యక్షుడిగా నందిపాటి వెంకటేశ్వర్లు, కార్యదర్శిగా కళ్లెం అశోక్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా నందిని, సత్య, హుస్సేన్, మడుపల్లి గోపి, సహాయ కార్యదర్శులుగా కె. అక్షిత, ముకేశ్, యశ్వంత్, కోశాధికారిగా గోపి శ్రీ ఎన్నికయ్యారు.
మండల కౌన్సిల్ సభ్యులుగా జెస్సి, ప్రియాంక, సువర్ణ, లక్ష్మణ్, సమీరా, దీప్తి, సాయి కీర్తి, లక్ష్మీ ప్రసన్న, వివేక్, నవదీప్, శశివర్ధన్, జస్వంత్, లక్ష్మణ రాజు, హరి ప్రసాద్, వెంకటకృష్ణ, అనుదీప్, సృజన, ఆకాష్ తదితరులను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఏఐఎస్ఎఫ్ మధిర మండల అధ్యక్ష, కార్యదర్శులు నందిపాటి వెంకటేశ్వర్లు, కళ్లెం అశోక్ మాట్లాడుతూ మధిర మండల వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలను చేపట్టి, మండల వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్‌ను మరింత బలోపేతం చేస్తామని అన్నారు.
మహాసభ తీర్మానాలు
- నిర్మాణంలో ఉన్న మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి.
- మండల వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, వసతి గృహ వార్డెన్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
- మధిర మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న గిరిజన బాలుర, బాలికల వసతి గృహాలకు నూతన భవనాలను మంజూరు చేయాలి.
- సిరిపురంలోని ఎస్సీ బాలికల వసతి గృహానికి నూతన భవనం మంజూరు చేయాలి. సిరిపురం జూనియర్ కళాశాల, పారిశ్రామిక శిక్షణ సంస్థకు అనుసంధానంగా బాలుర, బాలికల వసతి గృహాలను ఏర్పాటు చేయాలి.
- అద్దె భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ వసతి గృహాలకు సొంత భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలి.
విద్యార్థుల విద్యా హక్కులు, మౌలిక వసతులు, వసతి గృహాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని మహాసభలో తీర్మానించారు.