BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 11 April 2026, 07:21 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు అభివృద్ధికి 20 నెలల్లో పుట్టా విశేష కృషి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Apr, 2026 - 07:21 AM
191 వీక్షణలు

ఏలూరు అభివృద్ధికి 20 నెలల్లో పుట్టా విశేష కృషి  - ఘంటా స్వగృహంలో ఎంపీ పుట్టిన రోజు వేడుకలు

కామవరపుకోట:

ఏలూరు ఎంపీగా ఎన్నికైన ఈ 21 నెలల్లో పుట్టా మహేష్‌ ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేశారని చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ కొనియాడారు.

ఎంపీ పుట్టా మహేష్‌ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం ఉదయం పాతూరులోని చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ స్వగృహంలో, మండల పార్టీ అధ్యక్షులు కిలారు సత్యనారాయణ అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా జరిగాయి.

మురళీ మాట్లాడుతూ:

“పుట్టా మహేష్‌ తాను చేయని తప్పుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, త్వరలోనే క్లీన్‌ చీట్‌తో ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడతారని ఆశిస్తున్నాం. తనపై వస్తున్న విమర్శలకు తన పనితీరుతోనే సమాధానం చెప్తారని అన్నారు.”

అనంతరం, ఎంపీకి ఫోన్లో మురళీ మరియు కిలారు సత్యనారాయణ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

మండల టీడీపీ అధ్యక్షులు కిలారు సత్యనారాయణ మాట్లాడుతూ:

“మండలంలోని 15 గ్రామ పంచాయతీలలో పుట్టా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక దేవాలయాల్లో పూజలు కూడా నిర్వహించడం జరుగుతోంది. ఈ 21 నెలల్లో, పుట్టా మహేష్‌ రైతుల సమస్యలు, ఆయిల్‌ ఫామ్‌ రేటు పెంచే విషయంలో, కోకో రైతుల సమస్యలు, రహదారి పనుల వేగవంతీకరణ వంటి అనేక సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని ప్రశంసించారు.”

ఇవి కాకుండా, ఏలూరు - జంగారెడ్డిగూడెం రహదారి పనులు వేగవంతం చేయడం, వందే భారత్‌కు ఏలూరులో స్టాప్ ఏర్పాటు చేయడం, కొల్లేరు సమస్య పరిష్కారానికి కృషి చేయడం వంటి అనేక మంచి పనులు కూడా ఆయన చేతి వేసినట్లు వారు చెప్పారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ, మండల టీడీపీ అధ్యక్షులు కిలారు సత్యనారాయణ, సొసైటీ ప్రెసిడెంట్‌ ఘంటా మాధవరావు, పొన్నుబోయిన సురేష్, షేక్‌ ఇబ్రహీం, రెబ్బా పరాత్పరరావు, కిలారు సత్యంబాబు, బొల్లుబోయిన కళ్యాణం మరియు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.