BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 18 July 2026, 08:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ ఆవిష్కరణ మాజీ మంత్రి జోగి రమేష్ పిలుపు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Jul, 2026 - 08:03 PM
119 వీక్షణలు

జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్ ఆవిష్కరణ మాజీ మంత్రి జోగి రమేష్ పిలుపు

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కార్యాలయంలో శనివారం సాయంత్రం మాజీ మంత్రి, మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ జగన్ 2.0 సూపర్ యాప్ పోస్టర్‌ను ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ, పార్టీ శ్రేణులందరూ జగన్ 2.0 సూపర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై మరింత సమర్థంగా పోరాడేందుకు ఈ యాప్ డిజిటల్ వేదికగా ఉపయోగపడుతుందని చెప్పారు.

ప్రతి కార్యకర్తను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో నేరుగా అనుసంధానించే వారధిగా ఈ యాప్ పనిచేస్తుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ చర్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్టీ సామాజిక మాధ్యమ కార్యకర్తలకు ఇది బలమైన సాధనమని అన్నారు.

దేశంలోనే అత్యంత శక్తివంతమైన సామాజిక మాధ్యమ వ్యవస్థ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని జోగి రమేష్ పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను పార్టీ సామాజిక మాధ్యమం ప్రశ్నిస్తుండటంతో కూటమి ప్రభుత్వం దానిని అణచివేయాలని ప్రయత్నిస్తోందని విమర్శించారు.

ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ప్రజల తరఫున పోరాటాన్ని కొనసాగిద్దామని పిలుపునిస్తూ, పార్టీతో పాటు తాను కూడా కార్యకర్తలకు అండగా ఉంటానని జోగి రమేష్ తెలిపారు.