BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 02 June 2026, 05:41 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లాలో కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 05:41 AM
241 వీక్షణలు

ఏలూరు జిల్లాలో కలకలం.. జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నల్లమడు గ్రామ శివారులోని జీడిమామిడి తోటలో తల్లీకూతుళ్ల మృతదేహాలు లభ్యమవడం తీవ్ర కలకలం రేపింది.

మృతులను తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన వడ్డే వెంకటలక్ష్మి (తల్లి), వరలక్ష్మి (కూతురు)గా గుర్తించారు.

దూబచర్ల-చేబ్రోలు రహదారి పక్కన ఉన్న జీడిమామిడి తోటలో రెండు మృతదేహాలు వేర్వేరు ప్రదేశాల్లో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలంలో ఒక మహిళ తలకు బలమైన గాయం ఉన్నట్లు ప్రాథమికంగా తెలిసింది. అలాగే మహిళలకు చెందిన హ్యాండ్‌బ్యాగ్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే చేబ్రోలు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఈ ఘటన హత్యా? ఆత్మహత్యా? లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా? అనే అన్ని కోణాల్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.