BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 July 2026, 07:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లా విద్యుత్ కమిటీ సమావేశం.. పాల్గొన్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 07:46 PM
131 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లోని గౌతమి సమావేశ మందిరంలో జిల్లా విద్యుత్ కమిటీ (డీఈసీ) సమావేశం బుధవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్, ఇతర శాసనసభ్యులతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లాలో పునరుద్ధరించిన విద్యుత్ పంపిణీ రంగ పథకం (ఆర్‌డీఎస్‌ఎస్) అమలు, విద్యుత్ పంపిణీ వ్యవస్థ ఆధునీకరణ, విద్యుత్ సేవల నాణ్యత మెరుగుదల, మౌలిక సదుపాయాల బలోపేతం, విద్యుత్ నష్టాల తగ్గింపు, వినియోగదారులకు మరింత సమర్థవంతమైన, నాణ్యమైన విద్యుత్ సేవలు అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు.

అలాగే జిల్లాలో విద్యుత్ రంగ అభివృద్ధి పనులను వేగవంతం చేయడం, ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు. జిల్లా అభివృద్ధికి అనుగుణంగా విద్యుత్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంపై సమావేశంలో పలు కీలక నిర్ణయాలు చర్చకు వచ్చాయి.