BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 July 2026, 08:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడిలో ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 08:28 PM
114 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

ఏలూరు జిల్లా చింతలపూడిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఇన్‌చార్జి కంభం విజయరాజు ముఖ్య అతిథిగా హాజరై ఫైర్ స్టేషన్ సెంటర్‌లోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ సేవలను స్మరించుకుంటూ జన్మదిన కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంచిపెట్టారు.

ఈ సందర్భంగా కంభం విజయరాజు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన మహానేత వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల అభ్యున్నతి కోసం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ పార్టీ మరింత బలోపేతం కావాలని, ప్రతి కార్యకర్త ప్రజల్లో ఉండి పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జగ్గవరపు జానకి రెడ్డి, నీరజా సుధాకర్, కొప్పుల నాగేశ్వరరావు, బొడ్డు వెంకటేశ్వరరావు, మిరియాల దిలీప్, కాటూరి ఏలియా, సొంగ సందీప్, దుర్గారావు, ఆతుకూరి సుబ్బారావు, కృష్ణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.