BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 08 July 2026, 09:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నూజివీడులో ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 09:18 PM
122 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని చిన్నగాందీ బొమ్మ సెంటర్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు డాక్టర్ వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ, రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఫీజు రీయింబర్స్‌మెంట్, సామాజిక పింఛన్లు, మహిళలకు పావలా వడ్డీ రుణాలు, 108 అంబులెన్స్ సేవలు, జలయజ్ఞం వంటి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి కోట్లాది కుటుంబాల్లో ఆశలు నింపిన మహోన్నత ప్రజానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించి, పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడిగా ఆయనను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొని వైఎస్సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.