BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 08 July 2026, 09:18 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వైఎస్సార్ 77వ జయంతి సందర్భంగా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jul, 2026 - 09:18 PM
116 వీక్షణలు

దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకొని ఏలూరు జిల్లా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పాల్గొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేసిన మహోన్నత నాయకుడని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు సంక్షేమ పథకాలు వంటి అనేక ప్రజాహిత కార్యక్రమాలతో కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.

అనంతరం రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవ కొనసాగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.