BREAKING
thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్ thumb ● 40 ఏళ్ల టీడీపీ అనుబంధానికి స్వస్తి.. వైఎస్సార్‌సీపీలో చేరిన ఇర్లపాటి నరసయ్య thumb ● బాలల హక్కులకు భంగం కలిగించే ఉద్యోగులను శాశ్వతంగా తొలగించాలి thumb ● 1,105 మందికి చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత thumb ● వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిన రావులపాలెం మాజీ జెడ్పీటీసీ thumb ● ఖానాపూర్ మండలంలో వరి పంట కోత ప్రయోగం thumb ● ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అధికారులకు అవగాహన కార్యక్రమం thumb ● భవన నిర్మాణ కార్మికుల సెస్ నిధులను పక్కదారి పట్టిస్తే సహించేది లేదు thumb ● గార్లను కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి thumb ● పదవీ విరమణ అనంతరం శ్రీవారి సేవలో చంద్రారెడ్డి దంపతులు thumb ● లబ్ధిదారునికి చేయూత పెన్షన్ పత్రం అందజేసిన ఎమ్మెల్యే మురళీ నాయక్
Test 4
Date of Publish : 18 November 2026, 09:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీ ఆటో డ్రైవర్లకు శుభవార్త.. ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకానికి రూ.231.13 కోట్లు విడుదల ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Nov, 2026 - 09:34 PM
23 వీక్షణలు

పెండింగ్ బకాయిల చెల్లింపులకూ చర్యలు ఆంధ్రప్రదేశ్‌లో ఆటో డ్రైవర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకం అమలుకు రూ.231.13 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ఆటో డ్రైవర్లకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం కింద సొంతంగా ఆటోలు, మోటార్ క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు నడుపుతూ జీవనోపాధి పొందుతున్న అర్హులైన డ్రైవర్లకు ఏటా రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. వాహనాల నిర్వహణ, ఇంధన ఖర్చులు, కుటుంబ అవసరాలకు ఈ మొత్తం కొంత మేరకు ఉపయోగపడనుంది. అంతేకాకుండా గతంలో పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపులపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. తాజా నిధుల విడుదలతో అర్హులైన లబ్ధిదారులకు పథకం ప్రయోజనాలు అందించే ప్రక్రియకు మార్గం సుగమమైంది. ప్రభుత్వ నిర్ణయంతో ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరట లభించనుంది.