BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 18 March 2026, 12:18 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీ ప్రజలకు అలర్ట్ జనన, మరణాల నమోదులో కొత్త నిబంధనలు అమలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Mar, 2026 - 12:18 AM
265 వీక్షణలు

అమరావతి, మార్చి 18: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనన, మరణాల నమోదు ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న 1999 నిబంధనలను రద్దు చేసి, కొత్త రూల్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 17, 2026 నుంచి అమల్లోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

కొత్త నియమాల ప్రకారం పుట్టిన లేదా మరణించిన 21 రోజులలోపు నమోదు చేసుకుంటే ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా నమోదు చేయవచ్చు. అయితే 30 రోజుల తర్వాత నమోదు చేసుకుంటే రూ.250 జరిమానా విధించనున్నారు. ఒక సంవత్సరం దాటిన తర్వాత నమోదు చేయాలంటే రూ.500 ఫీజుతో పాటు మెజిస్ట్రేట్ అనుమతి తప్పనిసరి అని తెలిపారు.

జనన సర్టిఫికెట్‌లో పేరు నమోదు చేయని పక్షంలో, 12 నెలల లోపు ఉచితంగా పేరు చేర్చుకునే అవకాశం కల్పించారు. ఆ గడువు దాటితే అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

దత్తత పిల్లల నమోదు కోసం ప్రత్యేకంగా ‘ఫారమ్ 1-ఏ’ను ప్రవేశపెట్టారు. అలాగే ఇకపై జనన, మరణాల నమోదును పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నారు. డిజిటల్ సర్టిఫికెట్లు అందుబాటులోకి రానున్నాయి.

ప్రజలు ఈ కొత్త నిబంధనలను గమనించి, సమయానికి నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.