BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 01 June 2026, 07:06 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jun, 2026 - 07:06 PM
151 వీక్షణలు

ఏపీకి రెండు రోజులు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశముండటంతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి.

విశాఖపట్నం, అనకాపల్లి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వర్షాల ప్రభావంతో గత కొన్ని రోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. దక్షిణ కోస్తా ప్రాంతంలో ఈదురు గాలుల తీవ్రత కొనసాగనుండగా, సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజులపాటు దక్షిణ కోస్తా తీర ప్రాంత మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులు సమయంలో చెట్ల కింద నిలవకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.