BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 06 July 2026, 03:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో ఎల్లుండి (జూలై 8) నుంచి 'సదరం' స్లాట్ బుకింగ్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 03:39 PM
124 వీక్షణలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని దివ్యాంగులకు ప్రభుత్వం మరోసారి 'సదరం' సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. సదరం సర్టిఫికెట్ల జారీ కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూలై 8 నుంచి ప్రారంభమై ఆగస్టు చివరి వరకు కొనసాగనుంది.

అర్హులైన దివ్యాంగులు తమ సమీపంలోని మీ-సేవ కేంద్రాలు లేదా గ్రామ సచివాలయాల ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. జూలై 13 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల అనంతరం అర్హత కలిగిన వారికి సదరం సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దివ్యాంగులకు మరింత సులభంగా సేవలు అందించేందుకు సదరం విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రయాణ భారం తగ్గించేందుకు రాష్ట్రాన్ని ఆరు జోన్లుగా విభజించి, లబ్ధిదారులు తమ సొంత జోన్‌లోనే వైద్య పరీక్షలు చేయించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సదరం సర్టిఫికెట్లు పొందాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ సర్టిఫికెట్ల ద్వారా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పెన్షన్, విద్యా, ఉపాధి మరియు ఇతర రాయితీలను పొందే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు.