BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 06 July 2026, 03:59 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలి: అంబటి రాంబాబు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
06 Jul, 2026 - 03:59 PM
122 వీక్షణలు

మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్రంలో ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. బాధితులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా వారి తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు నమోదు చేసి ఎన్ని రోజులు జైళ్లలో ఉంచుతారని ప్రశ్నించిన ఆయన, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.

తాను గతంలో ఫిర్యాదు చేసిన అంశాలపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను దూషించే యూట్యూబర్లను ప్రోత్సహిస్తూ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై మాత్రం కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.

రావణ్‌పై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొంటూ, ఇటువంటి కక్ష సాధింపు చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్యాయానికి గురైన వారికి పార్టీతో సంబంధం లేకుండా అండగా నిలిచి, వారి హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.