BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 25 March 2026, 07:19 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

ఏప్రిల్ 16 నుండి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
25 Mar, 2026 - 07:19 AM
192 వీక్షణలు

ఏప్రిల్ 16 నుండి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ఏప్రిల్ 16 నుండి మే 13 వరకు ప్రత్యేక  వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఒక ప్రకటన లో తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెడికల్ అండ్ హెల్త్, చేనేత శాఖ,జిల్లా గ్రామీణ అభివృద్ధిశాఖల అధికారుల ఆధ్వర్యంలో శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని,ఈ శిబిరాలలో చేనేత కార్మికులకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు,వివిధ రకాల వ్యాధులపై నిపుణుల ద్వారా వైద్య సేవలు అందించబడతాయని తెలిపారు. అనుభవం ఉన్న జనరల్ ఫిజీషియన్,ఆర్థో పిజీషియన్, ఆప్తమాలజిస్ట్ లతో వివిధ సమస్యలను ఎదుర్కొంటున్న కార్మికులకు ప్రత్యేక చికిత్సలు అందించనున్నట్లు పేర్కొన్నారు.అన్ని మండలాలలో దశల వారీగా ఈ వైద్య శిబిరాలు నిర్వహించబడతాయని, చేనేత కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.అదేవిధంగా, అవసరమైన వారికి ఉచిత మందులు, చికిత్సలు కూడా అందించబడతాయని, వ్యాధుల  తీవ్రతను రిఫరల్ హాస్పటల్  తీసుకొని వెళ్లడం జరుగుతుందని తెలిపారు .