BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 10 October 2026, 09:34 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీ కాంగ్రెస్‌లో షర్మిల తీరుపై ఏఐసీసీ అసంతృప్తి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Oct, 2026 - 09:34 PM
6 వీక్షణలు

సీఈసీకి వ్యతిరేకంగా నిరసనల నిర్వహణలో జాప్యంపై ఆగ్రహం?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏఐసీసీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకత్వం పిలుపునిచ్చినట్లు సమాచారం. అయితే ఏపీలో పీసీసీ ఆధ్వర్యంలో ఆశించిన స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించలేదనే అసంతృప్తి పార్టీ అధిష్ఠానంలో వ్యక్తమైనట్లు వార్తలు వస్తున్నాయి.

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యవహారశైలిపై ఏఐసీసీ నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు చేపట్టకపోవడంపై సీనియర్ నాయకుడు, మాజీ పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు సహా పలువురు నాయకులు అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

పార్టీ కార్యక్రమాల నిర్వహణపై అధిష్ఠానం తీవ్రంగా స్పందించి, పార్టీ కోసం పనిచేయాలని, లేదంటే పదవికి రాజీనామా చేయాలని షర్మిలకు అల్టిమేటం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో షర్మిల హడావుడిగా విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ భవన్‌కు చేరుకున్నట్లు సమాచారం.

అనంతరం ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీల నాయకులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే షర్మిలను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించే నిర్ణయం తీసుకున్నారా, రాహుల్ గాంధీ నుంచి నిజంగానే ఆదేశాలు వచ్చాయా అనే అంశాలపై అధికారిక ధ్రువీకరణ అందుబాటులో లేదు. పార్టీ అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వెలువడితేనే ఈ పరిణామాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.