BREAKING
thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల thumb బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక thumb ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు దరఖాస్తులు thumb నవంబరు నుంచి వాడపల్లిలో తిరునామం ఉచితమే thumb కమనీయంగా కళ్యాణ మహోత్సవం thumb భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం thumb వాగుపై వంతెన నిర్మించాలని ఏడుగురాళ్లపల్లి ప్రజల డిమాండ్ thumb గణనాథుడిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి thumb వాడపల్లి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్ కుటుంబం thumb డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీపై గ్రామస్తుల ఆందోళన thumb చిత్తూరు నగరపాలక సంస్థ 60 వార్డుల తుది ఓటర్ల జాబితా విడుదల
Date of Publish : 08 August 2026, 12:51 pm
Posted by : NTODAY NEWS

ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను పాలకులు ఎందుకు పరిష్కరించడం లేదు?

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
08 Aug, 2026 - 12:51 PM
357 వీక్షణలు

గిరిజనుల హక్కులను పరిరక్షించాలి: తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మూడ్ ధర్మనాయక్

హైదరాబాద్, ఆగస్టు 8:

ఐక్యరాజ్యసమితి గుర్తించిన గిరిజనుల హక్కులను ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో అమలు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం, గిరిజన హక్కుల జాతీయ వేదిక డిమాండ్ చేసింది. గిరిజనుల జల్–జంగల్–జమీన్ హక్కులను పరిరక్షించడంతో పాటు వారి భాష, సంస్కృతి, సంప్రదాయాలు, స్వయం పాలన హక్కులను కాపాడాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎన్సీసీ సభ్యుడు మూడ్ ధర్మనాయక్ కోరారు.

ఆగస్టు 9న అంతర్జాతీయ ఆదివాసీ/గిరిజన ప్రజల హక్కుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల సమస్యలపై ప్రభుత్వాలు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

ఐక్యరాజ్యసమితి తీర్మానం

ప్రపంచవ్యాప్తంగా గిరిజన ప్రజల హక్కులను పరిరక్షించేందుకు ఐక్యరాజ్యసమితి చర్యలు చేపట్టిందని ధర్మనాయక్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గిరిజనుల మానవ హక్కులను అమలు చేయడం, జల్–జంగల్–జమీన్‌పై వారి హక్కులను గుర్తించడం, వారి భాష, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం, విద్యా–వైద్య సదుపాయాలు కల్పించడం, ఆర్థికంగా అభివృద్ధి చేయడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

రాజ్యాంగం గిరిజనుల ప్రత్యేక హక్కులను గుర్తించింది

భారతదేశంలో వేల సంవత్సరాలుగా గిరిజనులు అడవులు, ప్రకృతితో విడదీయరాని అనుబంధాన్ని కలిగి జీవిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అడవులను సంరక్షిస్తూ తమ ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటున్నారని తెలిపారు.

భారత రాజ్యాంగం గిరిజనుల ప్రత్యేక అస్తిత్వాన్ని గుర్తించి వారికి రాజకీయ, సామాజిక, ఆర్థిక రక్షణలు కల్పించిందన్నారు. రాజ్యాంగంలోని 5వ, 6వ షెడ్యూళ్లు, అలాగే ఆర్టికల్ 342 ద్వారా గిరిజనుల రక్షణకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని వివరించారు.

'వనవాసి' అనే పదంపై అభ్యంతరం

2026 మే 24న ఢిల్లీలో జరిగిన గిరిజన సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గిరిజనులను పదేపదే "వనవాసులు"గా సంబోధించడం ద్వారా వారి చారిత్రక, రాజ్యాంగబద్ధ గుర్తింపును బలహీనపరిచే ప్రయత్నం జరిగిందని ధర్మనాయక్ ఆరోపించారు.

"ఆదివాసి", "గిరిజన" అనే పదాలు వారి చరిత్ర, హక్కులు, అస్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయని, "వనవాసి" అనే పదం వారిని కేవలం అడవుల్లో నివసించే ప్రజలుగా చూపించే ప్రయత్నంగా తమకు అనిపిస్తోందని అన్నారు.

గిరిజనులపై ఒక నిర్దిష్ట మతపరమైన భావజాలాన్ని రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనివల్ల గిరిజన తెగల మధ్య విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

పీసా, అటవీ హక్కుల చట్టాలను పూర్తిగా అమలు చేయాలి

అటవీ హక్కుల చట్టం–2006, పీసా చట్టం–1996 ద్వారా గిరిజనుల హక్కులను రక్షించేందుకు చట్టపరమైన రక్షణలు కల్పించారని ధర్మనాయక్ గుర్తుచేశారు. గ్రామసభలకు కల్పించిన అధికారాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అటవీ వనరులపై గిరిజనుల సంప్రదాయ హక్కులను గుర్తించడం, గ్రామసభల నిర్ణయాలకు గౌరవం ఇవ్వడం, స్వయం పాలనకు అవకాశం కల్పించడం పీసా చట్టం ప్రధాన ఉద్దేశాల్లో భాగమని తెలిపారు.

మైనింగ్ పేరుతో గిరిజనుల మనుగడకు ముప్పు

దేశంలోని అనేక ప్రాంతాల్లో ఖనిజ వనరుల తవ్వకాల పేరుతో అడవులు ధ్వంసమవుతున్నాయని, దీనివల్ల గిరిజనుల జీవనాధారం, పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటున్నాయని ధర్మనాయక్ ఆరోపించారు.

బొగ్గు, ఇనుము, బాక్సైట్, మాంగనీస్, సున్నపురాయి, రాగి, బంగారం, యురేనియం తదితర ఖనిజాల తవ్వకాల ప్రభావం ప్రధానంగా గిరిజన ప్రాంతాలపైనే పడుతోందన్నారు. మైనింగ్ ప్రాజెక్టులకు అటవీ భూముల కేటాయింపుతో గిరిజనుల సంప్రదాయ జీవన విధానం దెబ్బతింటోందని పేర్కొన్నారు.

గిరిజన ప్రాంతాల్లో భూమి, అటవీ వనరుల పరిరక్షణ కోసం ప్రజలు ఆందోళనలు చేస్తున్నప్పటికీ, అనేక చోట్ల పోలీసు, అటవీ శాఖల చర్యలు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు.

గిరిజనులపై మతపరమైన గుర్తింపు రుద్దొద్దు

గిరిజన సమాజానికి ప్రత్యేకమైన ఆచారాలు, విశ్వాసాలు, సంస్కృతులు ఉన్నాయని ధర్మనాయక్ అన్నారు. జల్, జంగల్, జమీన్‌తో పాటు ప్రకృతి, ఆకాశం, అగ్ని వంటి ప్రకృతి అంశాలను వివిధ రూపాల్లో గిరిజన తెగలు తమ సంప్రదాయాల ప్రకారం ఆరాధిస్తారని తెలిపారు.

గిరిజనులను ఒక నిర్దిష్ట మతానికి అనుసంధానం చేయడం వల్ల వారి ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజనుల రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు, ప్రత్యేక సంక్షేమ ఫలాలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.

హక్కుల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలి

గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కులను పరిరక్షించడం ప్రభుత్వాల బాధ్యత అని మూడ్ ధర్మనాయక్ అన్నారు. పీసా చట్టం, అటవీ హక్కుల చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటు గ్రామసభల నిర్ణయాలను గౌరవించాలని కోరారు.

గిరిజనుల హక్కుల పరిరక్షణ కేవలం ఒక వర్గానికి సంబంధించిన అంశం కాదని, అది భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయ పరిరక్షణకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు.

గిరిజన సమాజం తమ హక్కులు, అస్తిత్వం, సంస్కృతి, భూమి, అటవీ వనరుల పరిరక్షణ కోసం ఐక్యంగా మరో పోరాటానికి సిద్ధం కావాలని మూడ్ ధర్మనాయక్ పిలుపునిచ్చారు.