BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 02 June 2026, 05:36 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో విధ్వంసం.. 18 మంది అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jun, 2026 - 05:36 AM
165 వీక్షణలు

ఐపీఎల్ విజయోత్సవాల పేరుతో విధ్వంసం.. 18 మంది అరెస్ట్

కర్నూలు నగరంలో ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్‌సీబీ విజయం అనంతరం నిర్వహించిన విజయోత్సవాలు కొందరి అత్యుత్సాహంతో విధ్వంసానికి దారితీశాయి. రాజ్ విహార్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులతో పాటు బస్సుల అద్దాలను ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలు, సోషల్ మీడియా వీడియోలు, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా ఘటనలో పాల్గొన్న 18 మందిని గుర్తించి అరెస్టు చేశారు.

అనంతరం వారిని కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు నడిరోడ్డుపై తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు.

ప్రభుత్వ, ప్రజా, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు స్పష్టం చేశారు. విజయోత్సవాలు, పండుగలు, ఇతర వేడుకలను శాంతియుతంగా నిర్వహించాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.