BREAKING
ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ
Date of Publish : 27 August 2026, 10:36 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

భూపాలపల్లి మైన్స్ ఏడీఈ జయరాజ్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

తెలంగాణ
/ జయశంకర్ భూపాలపల్లి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 10:36 AM
28 వీక్షణలు
భూపాలపల్లి మైన్స్ ఏడీఈ జయరాజ్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. 12 ప్రాంతాల్లో ఏకకాల తనిఖీలు

ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై రంగంలోకి ఏసీబీ అధికారులు
భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లా మైన్స్‌ ఏడీఈ బొజ్జ జయరాజ్ నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్‌లోని బోడుప్పల్‌తో పాటు భూపాలపల్లి ప్రాంతంలోని జయరాజ్ నివాసాల్లో గురువారం ఉదయం నుంచి ఏసీబీ బృందాలు సోదాలు చేపట్టాయి. అధికారులు కీలక పత్రాలు, ఆస్తులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
భూపాలపల్లి ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు కూడా జయరాజ్‌పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు.
జయరాజ్‌కు సంబంధించిన హైదరాబాద్, భూపాలపల్లి ప్రాంతాలతో పాటు సూర్యాపేట, తాండూరు తదితర ప్రాంతాల్లో మొత్తం 12 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సోదాలు పూర్తయిన తర్వాత ఆస్తుల వివరాలు, స్వాధీనం చేసుకున్న పత్రాలపై ఏసీబీ అధికారులు అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.