BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 15 September 2026, 07:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అఖిలభారత కిసాన్ మహాసభలను జయప్రదం చేయండి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Sep, 2026 - 07:15 PM
67 వీక్షణలు

 

అఖిలభారత కిసాన్ మహాసభలను జయప్రదం చేయండి ఎంఎల్ లిబరేషన్ మండల కార్యదర్శి వేముల బక్కయ్య ముసునూరు, సెప్టెంబర్ 15: అఖిలభారత కిసాన్ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ మండల కార్యదర్శి వేముల బక్కయ్య పిలుపునిచ్చారు. అఖిలభారత కిసాన్ మహాసభ మండల కమిటీ సమావేశం అధ్యక్షుడు మేడూరి సర్వీసు అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా వేముల బక్కయ్య మాట్లాడుతూ వ్యవసాయాన్ని, రైతులను రక్షించేందుకు పాలకవర్గ విధానాలకు వ్యతిరేకంగా రైతులు ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. అభివృద్ధి పేరుతో బలవంతపు భూసేకరణ విధానాలను అడ్డుకోవాలని, అటవీ చట్టాలను సవరించి ఆదానీ, అంబానీలకు భూములను కట్టబెట్టే విధానాలను వ్యతిరేకించాలని అన్నారు. 2014 నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశ రాజధానిలో 13 నెలల పాటు చారిత్రక పోరాటం జరిగిందని, 750 మంది రైతుల త్యాగాల ఫలితంగా ఆ చట్టాలను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అవే విధానాలను మరో రూపంలో అమలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 13 లక్షల ఎకరాలకు పైగా ప్రత్యేక ఆర్థిక మండళ్ల కోసం సేకరించిన భూములు ఖాళీగా ఉన్నాయని, వాటిని వినియోగించకుండా మూడు పంటలు పండే సారవంతమైన భూములను సేకరించడం సరికాదన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతుల భూములను జాయింట్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హులైన సాగుదారులకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. కౌలు రైతులందరికీ భూ యజమానితో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, హామీ లేని రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు నేరుగా నష్టపరిహారం అందించాలని కోరారు. స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం పంటలకు ఉత్పత్తి వ్యయానికి అదనంగా 50 శాతం మద్దతు ధర కల్పించాలని అన్నారు. రైతులకు రుణ విమోచన చట్టం తీసుకురావాలని, ఉచిత విద్యుత్ కొనసాగించాలని, స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లాలో పేదలు సాగు చేసుకుంటున్న అటవీ భూములకు సంబంధించి జారీ చేసిన నాలుగు నోటిఫికేషన్లను రద్దు చేయాలని కోరారు. 60 సంవత్సరాలు పైబడిన సన్న, చిన్నకారు రైతులకు నెలకు రూ.10 వేల పింఛన్ అందించాలని, ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని పంటలకు పంటల బీమా పథకాన్ని వర్తింపజేసి, బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. మెట్ట ప్రాంత రైతులకు వరప్రదాయినిగా భావించే చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండో దశను తక్షణమే పూర్తి చేయాలని, కార్మిక వ్యతిరేక నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం అఖిలభారత కిసాన్ మహాసభ ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాల్లో రైతు సోదరులు భుజం భుజం కలిపి పాల్గొనాలని పిలుపునిచ్చారు. భగత్ సింగ్ పుట్టిన గడ్డ పంజాబ్‌లోని జలంధర్‌లో సెప్టెంబర్ 20, 21 తేదీల్లో జరగనున్న ఐదో జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని, అందుకు ఆర్థిక, హార్దిక సహకారం అందించాలని వేముల బక్కయ్య కోరారు. ఈ కార్యక్రమంలో మేడూరి సర్వీసు, మేడూరి స్వర్ణకుమారి, నందిపాము రాణి, దార బేబీ శాలిని, పల్లెపాము భవాని తదితరులు పాల్గొన్నారు.