BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 10 August 2026, 02:58 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమరావతి ఛాంపియన్‌షిప్‌లో మర్లపాలెం విద్యార్థిని ప్రతిభ

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Aug, 2026 - 02:58 PM
98 వీక్షణలు



ఏలూరు జిల్లా: అమరావతి ఛాంపియన్‌షిప్‌–2026 జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఆగస్టు 6, 7 తేదీల్లో ఏలూరులోని అల్లూరి సీతారామరాజు క్రీడా మైదానంలో నిర్వహించారు. ఈ పోటీల్లో మర్లపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని యు. సృజన ప్రతిభ కనబరిచింది.

డివిజన్‌ స్థాయి పోటీల నుంచి జిల్లాస్థాయికి ఎంపికైన సృజన.. జిల్లాస్థాయిలో నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానం, దీర్ఘదూకుడులో ద్వితీయ స్థానం సాధించింది. దీంతో రాష్ట్రస్థాయిలో జరగనున్న క్రీడా పోటీలకు సృజన ఎంపికైంది.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మందాడ అప్పారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాల స్థాయి నుంచే ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. సృజన పట్టుదలతో సాధన చేసి జిల్లాస్థాయిలో మంచి ప్రతిభ కనబరచడం పాఠశాలకు గర్వకారణమన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ సృజన ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

సృజన సాధించిన విజయంపై పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేసి అభినందించారు. రాష్ట్రస్థాయిలోనూ రాణించి పాఠశాలకు, మర్లపాలెం గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.