BREAKING
ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి
Date of Publish : 09 September 2026, 02:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమరావతి: డీమార్ట్‌కు పోటీగా మీ మార్ట్లు.. అక్టోబర్ 1న ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Sep, 2026 - 02:52 PM
10 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 1,000 ‘మీ మార్ట్లు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. డీమార్ట్ తరహా విధానంలో తక్కువ ధరలకు నిత్యావసర సరుకులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ మార్ట్లను ఏర్పాటు చేస్తున్నారు.

అక్టోబర్ 1న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మీ మార్ట్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 970 షాపులు సిద్ధమయ్యాయని, మిగిలిన 130 షాపుల పనులను కూడా వేగంగా పూర్తి చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

డీమార్ట్‌కు పోటీగా అదే తరహా విధానంతో ‘మీ మార్ట్లు’ అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి తెలిపారు. తొలుత 64 రకాల నిత్యావసర సరుకులను మీ మార్ట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.

ప్రజలకు నాణ్యమైన సరుకులు అందించడంతో పాటు అందుబాటు ధరల్లో కొనుగోలు చేసే అవకాశం కల్పించడమే మీ మార్ట్ల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వీటి ఏర్పాటు పూర్తయితే స్థానికంగా వినియోగదారులకు మరింత సౌకర్యం కలగనుంది.