BREAKING
ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి
Date of Publish : 09 September 2026, 01:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమరావతి: స్థానిక ఎన్నికలకు జనసేన సమర సన్నద్ధం.. కమిటీలకు ఓరియంటేషన్

ఆంధ్రప్రదేశ్
/ ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Sep, 2026 - 01:38 PM
13 వీక్షణలు

అమరావతిలో ఇవాళ జనసేన స్థానిక సంస్థల ఎన్నికల కమిటీకి ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో స్థానిక ఎన్నికలకు జనసైనికులు, వీర మహిళలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం, ఎన్నికల వ్యూహం, క్షేత్రస్థాయి కార్యాచరణపై కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.

ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్‌తో పాటు ముగ్గురు సభ్యులను నియమించనున్నారు. ఈ కమిటీలు స్థానికంగా పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేస్తూ, ఎన్నికల సన్నద్ధతను వేగవంతం చేయనున్నాయి. దీంతో స్థానిక ఎన్నికలపై జనసేనలో రాజకీయ సందడి మరింత పెరగనుంది.