BREAKING
ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి
Date of Publish : 09 September 2026, 01:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ గణేష్ ఉత్సవాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Sep, 2026 - 01:38 PM
9 వీక్షణలు

అమరావతి..గణేష్ చతుర్థి వేడుకల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్ని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, మరింత వైభవంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. వినాయక మండపాల వద్ద విద్యుత్ అవసరాల కోసం నిర్వాహకులు ఇబ్బందులు పడకుండా ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించే గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వ నిర్ణయం భక్తుల్లో ఆనందం నింపింది. ప్రతి మండపం వద్ద ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తి వాతావరణంలో జరిగేలా అవసరమైన సహకారం అందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

“విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలి” అని మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు.