BREAKING
ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి
Date of Publish : 09 September 2026, 01:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కరీంనగర్‌లో పోలీస్ స్టేషన్ నుంచే పోలీస్ వాహనం చోరీ..!!

తెలంగాణ
/ కరీంనగర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Sep, 2026 - 01:38 PM
9 వీక్షణలు

కరీంనగర్: పోలీస్ స్టేషన్‌లో భద్రతగా ఉండాల్సిన పోలీస్ వాహనానికే దొంగలు ఎసరు పెట్టారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఉంచిన పెట్రోలింగ్ వాహనాన్ని అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లడం కలకలం రేపింది.

వాహనాన్ని చోరీ చేసిన వ్యక్తి రాత్రంతా అదే వాహనంలో తిరిగినట్లు తెలుస్తోంది. అనంతరం తెల్లవారుజామున వరంగల్ వైపు వెళ్తుండగా ఎల్కతుర్తి వద్ద వాహనానికి ప్రమాదం జరిగింది.

ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని ఎవరు చోరీ చేశారు? ఏ ఉద్దేశంతో తీసుకెళ్లారు? రాత్రంతా ఎక్కడెక్కడ తిరిగారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ నుంచే పోలీస్ వాహనం చోరీ కావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.