BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 04 April 2026, 07:23 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఘనంగా అమరావతి రాజధాని సంబరాలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Apr, 2026 - 07:23 AM
240 వీక్షణలు

అమరావతి రాజధాని సంబరాలు ఘనంగా – జనార్ధనవరం గ్రామంలో కొవ్వొత్తులతో ఆనందోత్సాహం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో టిడిపి గ్రామ పార్టీ అధ్యక్షులు మాదాసు చిన్న పుల్లయ్య మరియు మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు మాదాసు చంద్రకళ ఆధ్వర్యంలో అమరావతి రాజధాని సంబరాలు కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించడం ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు నెరవేరిన శుభసందర్భమని తెలిపారు. అమరావతి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా మారి, భవిష్యత్తులో ప్రపంచ స్థాయి నగరంగా ఎదగాలని ఆకాంక్షించారు.

అమరావతి నిర్మాణంతో యువతకు విస్తృతంగా ఉద్యోగావకాశాలు కలుగుతాయని, పెట్టుబడులు పెరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి ముఖ్యమంత్రి మరియు ప్రభుత్వం తీసుకున్న కృషిని వారు అభినందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామంలోని టిడిపి నాయకులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.