BREAKING
thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ thumb ● నంద్యాల జిల్లా కలెక్టర్ పోలూరు అంగన్‌వాడీ కేంద్రం సందర్శన thumb ● తప్పుడు ప్రచారంతో గ్రామ అభివృద్ధికి ఆటంకం. thumb ● ప్రచార రథాన్ని పరిశీలించిన నంద్యాల కలెక్టర్ thumb ● శ్రీ మాతృశ్రీ వృద్ధాశ్రమంలో .. ఘనంగా వృద్ధుల దినోత్సవ వేడుకలు thumb ● పోలూరులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ thumb ● అవార్డు గ్రహీత పున్న శ్రీనివాస్ కు మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఘన సత్కారం thumb ● ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర thumb ● ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నూతన కమిటీ ఎన్నిక.. thumb ● కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు thumb ● 27 మంది రైతులకు రూ.2 కోట్ల చెక్కుల పంపిణీ
Date of Publish : 17 August 2026, 01:19 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఘనంగా అమరావతి సంస్థాన పాలకుడు రాజా వెంకటాద్రి నాయుడు వర్ధంతి వేడుకలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 Aug, 2026 - 01:19 PM
98 వీక్షణలు

ఘనంగా అమరావతి సంస్థాన పాలకుడు రాజా వెంకటాద్రి నాయుడు వర్ధంతి వేడుకలు 

పెనుగొలనులో ఘన నివాళులు.. ఆయన సేవలు చిరస్మరణీయం: వక్తలు

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం:

గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో అమరావతి సంస్థాన పాలకుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 209వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కార్యక్రమంలో టీచర్ కే. లింగమ్మ మాట్లాడుతూ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1761 ఏప్రిల్ 27న చింతపల్లి సంస్థానంలో జగ్గ భూపలి, అచ్చమాంబ దంపతులకు జన్మించారని తెలిపారు. అమరావతిని రాజధానిగా చేసుకుని 1783 నుంచి 1817 వరకు ప్రజా రంజక పాలన అందించిన గొప్ప పాలకుడిగా ఆయన గుర్తింపు పొందారని వివరించారు.

కృష్ణా డెల్టా ప్రాంతంలో 108 దేవాలయాలు, మందిరాలను నిర్మించి, పునరుద్ధరించిన ఘనత వెంకటాద్రి నాయుడికి దక్కుతుందని తెలిపారు. అమరావతిలోని శ్రీ అమరేశ్వర స్వామి ఆలయ అభివృద్ధితో పాటు పెద్ద గోపురాలు, ప్రాకారాల నిర్మాణం చేపట్టారని, మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి 11 అంతస్తుల గాలిగోపురం నిర్మించారని పేర్కొన్నారు. చేబ్రోలు బ్రహ్మ దేవాలయం సహా పలు శివాలయాల నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు.

పొన్నూరు తదితర ప్రాంతాల్లో ఒకే శుభ ముహూర్తంలో 108 శివలింగాలను ప్రతిష్ఠించి తన భక్తిని చాటుకున్నారని కొనియాడారు.

సాయిబాబా యూత్ కమిటీ అధ్యక్షుడు వూటుకూరు యజ్ఞ కృష్ణ మాట్లాడుతూ వెంకటాద్రి నాయుడు గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలోని 552కు పైగా గ్రామాలను పాలించి ప్రజా సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని తెలిపారు.

ఆ కాలంలోనే దేవాలయాల నిర్మాణంతో పాటు వాటి నిర్వహణకు అవసరమైన నిత్య పూజలు, ధూప దీప నైవేద్యాల కోసం వేలాది ఎకరాల మాన్య భూములను దానంగా ఇచ్చిన గొప్ప దాతగా నిలిచారని పేర్కొన్నారు.

చివరి దశలో దేశంలోని అనేక ప్రాంతాల్లో తీర్థయాత్రలు చేసిన వెంకటాద్రి నాయుడు, తాను సందర్శించిన ప్రాంతాల్లో అన్నదాన సత్రాలు ఏర్పాటు చేసి ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు.

రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1817 ఆగస్టు 17న మరణించారని తెలిపారు. వర్ధంతి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వారికి మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడి సహాయకురాలు దేవర అంజలి, గ్రామస్తులు, అంగన్వాడి చిన్నారులు పాల్గొన్నారు.