BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 19 March 2026, 06:06 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అంబటి లాయర్ ఎంట్రీతో పొన్నవోలుకు చెక్…

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 06:06 AM
190 వీక్షణలు

అంబటి లాయర్ ఎంట్రీతో పొన్నవోలుకు చెక్… వైసీపీ లీగల్ సెల్‌లో కొత్త పవర్ ఫైట్ 

వైసీపీలో అంతర్గత లీగల్ పోరు ఆసక్తికరంగా మారింది. అంబటి రాంబాబు తన కేసులో స్వయంగా వాదించేందుకు ముందుకు రావడం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హైకోర్టుకు నల్లకోటు వేసుకుని వెళ్లి, పిటిషన్ కూడా తానే తయారు చేసుకోవడం ఆయన దూకుడును చూపిస్తోంది.

ఇప్పటివరకు పార్టీ తరఫున కీలక లీగల్ ఫేస్‌గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డిను ఈసారి పూర్తిగా పక్కన పెట్టడం మరింత చర్చకు దారితీసింది. గతంలో అంబటి అరెస్టు సమయంలో పొన్నవోలు కోర్టులో బలంగా వాదించగా, ఇప్పుడు మాత్రం అంబటి “నా కేసు నేనే చూసుకుంటా” అంటూ స్వయంగా రంగంలోకి దిగడం రాజకీయ సంకేతంగా భావిస్తున్నారు.

పార్టీలో ఇది కేవలం ఒక కేసు వ్యవహారం కాకుండా, లీగల్ సెల్‌లో ఆధిపత్య పోరుగా మారిందనే అభిప్రాయం వినిపిస్తోంది. సీనియర్ లాయర్లను కూడా పక్కన పెట్టి అంబటి సోలోగా ముందుకు రావడం, వైసీపీలో కొత్త పవర్ సెంటర్‌గా ఎదగాలనే ప్రయత్నంగా విశ్లేషిస్తున్నారు.

ఓటమి తర్వాత పార్టీ సెకండ్ లైన్ నాయకులు చాలామంది సైలెంట్‌గా ఉన్న సమయంలో, అంబటి మాత్రం కోర్టు-రాజకీయాల్లో ఒకేసారి యాక్టివ్‌గా ఉండటం గమనార్హం. దీంతో భవిష్యత్తులో పార్టీ లీగల్ వ్యవహారాల్లో ఆయన పాత్ర మరింత పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి.

అయితే, ఈ పరిణామం వల్ల పొన్నవోలు వర్గంలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని కూడా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి, అంబటి తీసుకున్న ఈ నిర్ణయం వైసీపీలో లీగల్ లీడర్‌షిప్‌పై కొత్త సమీకరణాలకు దారి తీసేలా కనిపిస్తోంది.