అన్నమయ్య జిల్లా : 19 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 19 మంది సివిల్ కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన సిబ్బంది జిల్లా పోలీసు అధికారి ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్, అదనపు పోలీసు అధికారి ఎం. వెంకటాద్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారి మాట్లాడుతూ.. పదోన్నతితో పాటు కేసుల ప్రాథమిక దర్యాప్తు నిర్వహించే అధికారాలు కూడా లభిస్తాయని తెలిపారు. దీంతో పదోన్నతి పొందిన సిబ్బందిపై బాధ్యతలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. అప్పగించిన విధులను పూర్తి జవాబుదారీతనంతో నిర్వర్తించాలని సూచించారు.
ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ పోలీసు శాఖపై నమ్మకం మరింత పెరిగేలా విధులు నిర్వహించాలని సూచించారు. తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని పదోన్నతి పొందిన సిబ్బందికి తెలిపారు.
ఈ సందర్భంగా అధికారులు పదోన్నతి పొందిన 19 మంది హెడ్ కానిస్టేబుళ్లకు అభినందనలు తెలియజేశారు.