BREAKING
thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం thumb ● చౌడేపల్లె మండలంలో నామినేషన్ కేంద్రాలు ఖరారు thumb ● మండల ప్రథమ ర్యాంకర్‌కు రూ.15 వేల నగదు బహుమతి thumb ● నెల్లికుదురు సమీపంలో కారు బోల్తా.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు thumb ● తక్కువ ఖర్చుతో పోషకాహార తయారీపై అవగాహన.. అంగన్వాడీ కేంద్రంలో వంటల ప్రదర్శన thumb ● బీసీల హక్కుల సాధన కోసం ‘ఛలో ఢిల్లీ’ గోడపత్రికల ఆవిష్కరణ thumb ● మహబూబాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలి thumb ● సుస్మిత మరణానికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలి thumb ● వలిగొండలో ఎస్ జి ఎఫ్ కబడ్డీ పోటీలు ప్రారంభం thumb ● డ్రైనేజీ నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? thumb ● అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
Test 4
Date of Publish : 17 November 2026, 03:56 pm
Posted by : K MAHESH

ఆరోపణలకు ఆధారాలతో సమాధానం.. ప్రతి అంశంపై రికార్డులు బయటపెడతా

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
K Mahesh Munugodu Constituency
17 Nov, 2026 - 03:56 PM
25 వీక్షణలు

వైఎస్ఆర్ నగర్ భూములు, కాజీపేట భవనంపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వివరణ

హనుమకొండ జిల్లా | నవంబర్ 17 | ఎన్ టుడే న్యూస్

కాజీపేటలోని వైఎస్ఆర్ నగర్ భూములు, కాజీపేట చౌరస్తాలో నిర్మించిన భవనానికి సంబంధించి బీఆర్ఎస్, బీజేపీ నాయకులతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు చేస్తున్న ఆరోపణలపై వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పందించారు. మంగళవారం కాజీపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన పత్రాలు, రెవెన్యూ రికార్డులు, భూముల వివరాలు, నిర్మాణ అనుమతులకు సంబంధించిన డాక్యుమెంట్లను మీడియా ముందు ఉంచి తన వివరణను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైఎస్ఆర్ నగర్ గుడిసెవాసుల సమస్యపై గతంలోనే ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించానని, మరింత సమగ్ర సమాచారం కోసం మరోసారి దరఖాస్తు చేసినట్లు తెలిపారు. రెవెన్యూ, కుడా, మున్సిపల్ కార్పొరేషన్ శాఖల నుంచి పూర్తి సమాచారం అందిన తర్వాత అన్ని వాస్తవాలను ప్రజల ముందుంచుతానని చెప్పారు. తాను ఏ అంశంపై మాట్లాడినా అధికారిక ఆధారాలతోనే మాట్లాడతానని స్పష్టం చేశారు.

వైఎస్ఆర్ నగర్ భూములపై ప్రశ్నలు

వైఎస్ఆర్ నగర్ భూములకు సంబంధించి ఇరానీ కుటుంబానికి చెందిన భూములు అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోకి రావడంతో అప్పట్లో కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారని నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. అయితే న్యాయపరిధిలో ఉన్న ఈ భూములను 2019లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, అప్పటి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో నాలా కన్వర్షన్ చేసి కుటుంబ సభ్యుల పేర్లపై ఎలా నమోదు చేశారని ప్రశ్నించారు. 2018 వరకు సీలింగ్ భూములుగా ఉన్న భూముల్లో 2019లో జరిగిన మార్పులను పహాణీలు, ఇతర రెవెన్యూ రికార్డుల ఆధారంగా వివరించినట్లు చెప్పారు. ఈ భూముల విషయంలో గుడిసెవాసుల హక్కులపై కూడా సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

కాజీపేట చౌరస్తా భవన నిర్మాణంపై వివరణ

కాజీపేట చౌరస్తాలో నిర్మించిన భవనానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే పలు ప్రశ్నలు లేవనెత్తారు. 2017లో అప్పటి కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి హయాంలో రెసిడెన్షియల్ భూమిని కమర్షియల్ అవసరాలకు అనుగుణంగా ఎలా మార్చారో సంబంధిత వ్యక్తులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. భవన నిర్మాణ అనుమతులు, సెట్‌బ్యాక్‌లు, నిర్మాణ మార్పులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) మంజూరు తదితర అంశాలకు సంబంధించిన పత్రాలను మీడియాకు చూపించారు. తమ హయాంలో వైఎస్ఆర్ నగర్ ప్రజలకు అన్యాయం జరిగిందని ఆరోపణలు చేస్తూ, ఇప్పుడు తమపై విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

వైఎస్ఆర్ నగర్ ప్రజలకు ఇబ్బందులు కలగకూడదు

వైఎస్ఆర్ నగర్‌లో నివసిస్తున్న పేద ప్రజలను ఎవరూ ఇబ్బందులకు గురిచేయకూడదని ఎమ్మెల్యే కోరారు. ప్రభుత్వ శాఖల అధికారులు కూడా స్థానికులను అనవసరంగా భయాందోళనలకు గురిచేయవద్దని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ 144 సెక్షన్ విధించినట్లు వెల్లడించారు. స్థానికుల ప్రశాంతతకు భంగం కలగకుండా, బయటి వ్యక్తులు వచ్చి వివాదాలు సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు.

విగ్రహం ధ్వంసంపై సీసీటీవీ ఆధారాలు ఉన్నాయన్న ఎమ్మెల్యే

హంటర్ రోడ్డులో శిల్పారామం లేదా ఇతర పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలనే ఆలోచన ఉన్న సమయంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరులు తనను సంబంధం లేని వివాదంలోకి లాగేందుకు రాత్రికి రాత్రే విగ్రహాన్ని ఏర్పాటు చేశారని నాయిని ఆరోపించారు. అనంతరం అదే విగ్రహాన్ని వారి అనుచరులే ధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు తన వద్ద ఉన్నాయని, వాటిని కూడా మీడియాకు అందజేస్తానని తెలిపారు. మతపరమైన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు.

కుడా భూముల వేలం ఆదాయం ప్రజాప్రయోజనాలకు వినియోగించాలి

కుడా భూముల వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని వరంగల్ బస్టాండ్, స్టేడియం అభివృద్ధి వంటి ప్రజాప్రయోజన కార్యక్రమాలకు వినియోగించాలనే ఉద్దేశంతో అధికారులతో చర్చించినట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ అంశాన్ని కూడా కొందరు రాజకీయ ఆరోపణలకు ఉపయోగించుకుంటున్నారని అన్నారు.

రాజకీయ విమర్శలకు తాను భయపడబోనని, వైఎస్ఆర్ నగర్ భూములు, కాజీపేట చౌరస్తా భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతి అంశంపై అధికారిక రికార్డులను సేకరించి ప్రజల ముందు ఉంచుతానని నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మాజీ కార్పొరేటర్లు జక్కుల రవీందర్, విజయశ్రీ రాజాలి, తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, అబూబకర్, గుంటి కుమార్, సీనియర్ నాయకులు అంకుష్, సమత రాజు, పల్లకొండ సతీష్, డివిజన్ అధ్యక్షుడు పాలడుగుల ఆంజనేయులు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గమనిక: భూముల మార్పిడి, నిర్మాణ అనుమతులు, విగ్రహం ధ్వంసం తదితర అంశాలపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలుగా మాత్రమే పేర్కొనబడ్డాయి. వాటి వాస్తవాలను సంబంధిత అధికారిక రికార్డులు, విచారణ ద్వారా నిర్ధారించాల్సి ఉంటుంది.