BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 06:46 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్‌ను రద్దు చేయాలి

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
09 Nov, 2026 - 06:46 PM
10 వీక్షణలు

కార్మికులకు నెలకు రూ.42 వేల కనీస వేతనం చెల్లించాలి: సీఐటీయూ జిల్లా నాయకులు పి.కేశవరావు

కనిగిరి, నవంబర్ 9 (ఎన్ టుడే న్యూస్):

సీఐటీయూ కనిగిరి మండల కమిటీ సమావేశం సోమవారం కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవనంలో నిర్వహించారు. దేవదానం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు పి.కేశవరావు పాల్గొని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, కార్మిక హక్కుల పరిరక్షణపై మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్‌ను తక్షణమే రద్దు చేయాలని పి.కేశవరావు డిమాండ్ చేశారు. దేశంలోని కార్మికులందరికీ నెలకు కనీస వేతనంగా రూ.42 వేలు చెల్లించాలని కోరారు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానాల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేసి పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే ఎస్ఐఆర్ పేరుతో దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని సమావేశంలో డిమాండ్ చేసినట్లు తెలిపారు.

కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పి.కేశవరావు పిలుపునిచ్చారు. కార్మిక హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు.

సమావేశంలో కార్మికుల సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై నాయకులు చర్చించారు.

ఈ సమావేశంలో సీఐటీయూ మండల కన్వీనర్ పి.నరేంద్ర, నాయకులు రోమా, శ్రీను, ప్రసంగి, రజిని, సుజాత, రవికుమారి, రాజ్యలక్ష్మి, రిజ్వానా, భాగ్యలక్ష్మి, మాధవి, శాంతకుమారి, ఆదిలక్ష్మి, ప్రమీల, సుబ్బులు తదితరులు పాల్గొన్నారు.