BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 04 December 2025, 10:06 am
Posted by : NTODAY NEWS OFFICIAL

పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయం పై అవగాహన కార్యక్రమం

తెలంగాణ
04 Dec, 2025 - 10:06 AM
351 వీక్షణలు

పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయం పై అవగాహన కార్యక్రమం

NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాలోని మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల లో బాగంగా బొమ్మలరామారం, ఆలేరు, ఆత్మకూరు, రాజాపేట, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండలాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయం పై అవగాహన కార్యక్రమం వివిధ మండలాలలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎన్నికల వయ్య పరిశీలకులు ఎం.శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరైనారు.ఈ మేరకు జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎం. శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఎన్నికల ప్రచార ఖర్చులను, పోటీ చేసే అభ్యర్థులు పకడ్బందీగా స్పష్టంగా నమోదు చేయాలన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు పూర్తి ఖర్చుల రికార్డులతో వ్యయ పరిశీలనకులనకు తప్పనిసరిగా హాజరు కావాల్సింది ఉంటుందన్నారు. 5 వేలకు పైగా జనాభా గల గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గరిష్ట వ్యయ పరిమితి రెండు లక్షల 50 వేలు, వార్డు మెంబర్ కు 50 వేలు వ్యయ పరిమితి గలదని అలాగే 5 వేల లోపు జనాభా గల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గరిష్ట వ్యయ పరిమితి 1.50 లక్షలు,వార్డు మెంబర్ కు 30 వేలు మాత్రమేనని తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచార నిమిత్తం ఉపయోగించే వాహనాలను స్థానిక తహసిల్దార్/ రిటర్నింగ్ అధికారి దగ్గర తప్పనిసరిగా అనుమతి పొందాలని అనుమతి లేకుండా వినియోగించినట్లయితే ఎన్నికల నియమా నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఎన్నికలలో రోజువారి చేసిన ప్రచార ఖర్చులకు సంబంధించి ప్రతి పైసాను తమ ఖర్చుల ఖాతాలలో చూపించాలన్నారు.మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న మండలాలకు (బొమ్మలరామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, ఆలేరు, ఆత్మకూర్,రాజాపేట) సంబంధించి డిసెంబర్ 6న మొదటి విడత,డిసెంబర్ 8న రెండో విడతగా రెండుసార్లు అభ్యర్థుల ఖర్చుల లెక్కలను పరిశీలిస్తారన్నారు. ఆయా లెక్కలన్నీ సంబంధిత మండల పరిషత్ అధికారి కార్యాలయంలో ఉదయం 10:00 నుండి 5 గంటల మధ్య పరిశీలిస్తారన్నారు. అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు ఎన్నికల కాక నిర్వహణ రిజిస్టర్ సంబంధిత డాక్యుమెంట్లో పరిశీలకుల ముందు ఆయా తేదీలలో తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. ఎన్నికల వ్యయ పరిశీలనకు హాజరుకాని అభ్యర్థికి నోటీసులు జారీ చేస్తామని, నోటీసులకు సరైన సంజాయిషీ లేనట్లయితే ఎన్నికల నియమా నిబంధన మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి , ఓడిపోయిన అభ్యర్థి ఎన్నికల ఫలితాల తరువాత 45 రోజుల్లో తుది వివరాలు తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు.పోటీ చేయు అభ్యర్థి ప్రచార సమయంలో తమ వద్ద రూ.1000/ కంటే ఎక్కువ సరైన ఆధారాలు లేకుండా ఉండడానికి వీలు లేదన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube