BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 16 April 2025, 07:21 am
Posted by : NTODAY NEWS OFFICIAL

భూభారతి చట్టం పై అవగాహన సదస్సులు ప్రతి గ్రామంలో నిర్వహించాలి

తెలంగాణ
16 Apr, 2025 - 07:21 AM
182 వీక్షణలు
భూభారతి చట్టం పై అవగాహన సదస్సులు ప్రతి గ్రామంలో నిర్వహించాలి--యాదాద్రి భువనగిరి జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి. NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, ఏప్రిల్ 16 ఇప్పలపల్లి నరేందర్ జాయింట్ నల్గొండ జిల్లా బ్యూరో భూభారతి - కొత్త ఆర్ఓఆర్ చట్టం ప్రతి ఒక్క రెవెన్యూ అధికారి, సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జిల్లాలోని తాసిల్దారులు, డిప్యూటీ తహసిల్దార్లు, రెవెన్యూ సిబ్బందికి భూ - భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం గురించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ మాట్లాడుతూ...ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి అనేది ఏమైనా భూ సమస్యలు ఉంటే సులభతరంగా భూ భారతి చట్టం ద్వారా పరిష్కరించవచ్చని అన్నారు. ధరణి సమస్యలు పరిష్కారంకు భూమి ఉన్న ప్రతి మనిషికి ఆధార్ కార్డు మాదిరిగానే భూధార్ కార్డులు ప్రతి భూమి ఉన్న వారికి ప్రభుత్వం అందిస్తుందన్నారు. గ్రామాలలో రేపటి నుండి జరగబోయే అవగాహన సదస్సులు, క్యాంపులు ద్వారా ప్రజలకు అర్థం అయ్యేలా అవగాహన కల్పించి వారి యొక్క భూ సమస్యలకు ఈ చట్టం సత్వర పరిష్కారం అవుతుందని తెలియజేయాలన్నారు. ప్రజలకు అర్థం అయ్యేలా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, కర పత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతి ఒక్క గ్రామ సమావేశంలో రైతులు, ప్రజల సమస్యలు తెలుసుకుని ఈ చట్టం ద్వారా పరిష్కరించాలన్నారు. ప్రజలకు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారత్ ను ప్రజలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డిఓ కృష్ణారెడ్డి, జిల్లాలోని రెవెన్యూ తాహసిల్దార్ లు,డిప్యూటీ తాహ సిల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube