BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 20 July 2026, 01:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి దూరం.. బీజేపీలో చేరికపై ఊహాగానాలు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Jul, 2026 - 01:25 PM
85 వీక్షణలు

బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి దూరం.. బీజేపీలో చేరికపై ఊహాగానాలు

తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సరూర్‌నగర్‌లో జరిగిన యువ సంగ్రామ సభతో పాటు కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరుకావడం లేదు.

ఈ నేపథ్యంలో ఇద్దరూ పార్టీకి దూరమవుతున్నారనే చర్చ జరుగుతోంది. పార్టీ నాయకత్వం కూడా వారి వైఖరిపై పెద్దగా స్పందించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, మల్లారెడ్డి కుటుంబ సభ్యులు బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ముఖ్యంగా ఆయన కోడలు బీజేపీ నాయకులతో టచ్‌లో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే, మల్లారెడ్డి లేదా బీజేపీ నుంచి ఈ ప్రచారంపై అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఆయన కుటుంబం బీజేపీలో చేరుతుందా లేదా అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకే పరిమితమైంది.