BREAKING
thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం
Date of Publish : 18 August 2026, 01:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బీజేపీ జాతీయ కార్యవర్గంలో కీలక మార్పులు.. కొత్త బాధ్యతలు ప్రకటించిన అధిష్ఠానం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 01:16 PM
68 వీక్షణలు

ఢిల్లీ: భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. పార్టీలో కీలక పదవులకు పలువురు సీనియర్ నేతలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

కొత్త కార్యవర్గంలో 13 మందికి జాతీయ ఉపాధ్యక్ష పదవులు కేటాయించారు. జాతీయ ఉపాధ్యక్షులుగా రాంమాధవ్‌, పురందేశ్వరి, వసుంధర రాజే తదితరులకు అవకాశం కల్పించారు.

మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు.

పీయూష్‌ గోయల్‌కు జాతీయ కోశాధికారి పదవి ఇచ్చారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) పదవిలో బీఎల్‌ సంతోష్‌ను మరోసారి కొనసాగించారు.

కొత్త జాతీయ కార్యవర్గం ద్వారా పార్టీ బలోపేతం, సంస్థాగత విస్తరణ, రాబోయే ఎన్నికలకు వ్యూహాత్మక ప్రణాళికలపై దృష్టి సారించనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.