BREAKING
thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం thumb ● రామన్నపేటలో అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు వినతి thumb ● ఆళ్లగడ్డ అభివృద్ధిపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ముఖాముఖి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి
Date of Publish : 23 August 2026, 05:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఢిల్లీ: 42 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన హత్య కేసు నిందితుడు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 05:30 PM
75 వీక్షణలు

ఢిల్లీ: 42 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన హత్య కేసు నిందితుడు

1984లో ఢిల్లీలో జరిగిన ఓ హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు 42 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు. నాథులాల్ అనే వ్యక్తి అప్పట్లో కేసు నమోదైన తర్వాత పోలీసుల కంటపడకుండా తప్పించుకున్నాడు.

ఈ కేసులో మరో నిందితుడు అప్పుడే పట్టుబడినా.. నాథులాల్ మాత్రం ఆచూకీ లేకుండా పోయాడు. ఇటీవల ఢిల్లీ పోలీసులు పాత కేసు ఫైళ్లను తిరగదీసి మళ్లీ దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో నాథులాల్ ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు.

ఆగస్టు 18న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తన వివరాలు బయటపడకుండా ఉండేందుకు నాథులాల్ కూరగాయల మార్కెట్లలో చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవించాడని పోలీసులు తెలిపారు. ఇన్నేళ్లలో అతడు పెళ్లి కూడా చేసుకోలేదని వెల్లడించారు. 42 ఏళ్లుగా తప్పించుకుని తిరిగిన నిందితుడు ఎట్టకేలకు పోలీసులకు చిక్కడంతో పాత కేసు మళ్లీ చర్చనీయాంశమైంది.