BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 22 March 2026, 04:36 pm
Posted by : V శ్రీనివాస్

బీసీల బడ్జెట్ దగా: మంచిర్యాలలో బడ్జెట్ ప్రతుల దహనం

తెలంగాణ
/ తెలంగాణ / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
22 Mar, 2026 - 04:36 PM
247 వీక్షణలు

బీసీల బడ్జెట్ దగా: మంచిర్యాలలో బడ్జెట్ ప్రతుల దహనం

మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని నిరసిస్తూ బడ్జెట్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ మరియు ఇతర నేతలు మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కేవలం రూ. 12,511 కోట్లతో సరిపెట్టడం 56 శాతం ఉన్న బీసీ జనాభాను ఘోరంగా వంచించడమేనని మండిపడ్డారు. గత బడ్జెట్‌లలో రూ. 9 వేల కోట్లు, రూ. 11 వేల కోట్లు కేటాయించి బీసీల అభివృద్ధిని అణగదొక్కారని, తాము రూ. 50 వేల కోట్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం పెడచెవిన పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బడ్జెట్‌పై పునర్ సమీక్ష చేపట్టకపోతే బీసీ సమాజం ముందు కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టి ఎండగడతామని వారు తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, వేముల అశోక్, రామగిరి రాజన్న చారి, మహిళా నాయకురాలు పేరం అలేఖ్య, కొట్టే నటేశ్వర్, మంచెర్ల సదానందం, చంద్రగిరి చంద్రమౌళి తదితరులు పాల్గొని నిరసనను ఉధృతం చేశారు