BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 14 February 2026, 08:16 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

డిప్యూటీ తహసిల్దార్‌గా ఎంపికైన బండి సౌజన్య

తెలంగాణ
14 Feb, 2026 - 08:16 PM
278 వీక్షణలు
గ్రూప్-2లో విజయం: డిప్యూటీ తహసిల్దార్‌గా ఎంపికైన బండి సౌజన్యకు అభినందనలు NTODAY NEWS: ఏలూరు స్థానిక 44వ డివిజన్ రెల్లిపేటకు చెందిన బండి సౌజన్య గ్రూప్-2 పరీక్షలో తొలి ప్రయత్నంలోనే డిప్యూటీ తహసిల్దార్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జాతీయ సీనియర్ దళిత నేత, అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్ డాక్టర్ పొలిమేర హరికృష్ణ ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యువత నిరాశ, నిస్పృహలకు లోనవకుండా సౌజన్య వంటి విజయవంతమైన వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. పేదరికం, వివక్ష వంటి సమస్యలను అధిగమించేందుకు విద్యే ప్రధాన ఆయుధమని పేర్కొన్నారు. విద్య ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించినప్పుడు సమాజం వ్యక్తి కులాన్ని కాకుండా సాధించిన విజయాన్ని మాత్రమే గుర్తిస్తుందని అన్నారు. సౌజన్య భవిష్యత్తులో ఐఏఎస్ సాధించాలని ఆకాంక్షిస్తూ ఆమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జనసేన నాయకుడు జనపరెడ్డి తేజతో పాటు రెల్లిపేటకు చెందిన మహిళలు, నాయకులు మరియు ఇతరులు పాల్గొన్నారు. #Group2Success #DeputyTahsildar #WomenAchievement #YouthInspiration #EducationEmpowers Follow us on Website Facebook Instagram YouTube