BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 07 July 2026, 08:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బొగాపురం విమానాశ్రయాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 08:38 PM
111 వీక్షణలు

విజయనగరం జిల్లాలో నిర్మాణం పూర్తిచేసుకున్న బొగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి , విజయనగరం ఎంపీ , జీఎంఆర్ ప్రతినిధులతో కలిసి మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం అద్భుతంగా నిర్మితమైందని, ఉత్తరాంధ్రకు మణికిరీటంగా నిలిచే విధంగా బొగాపురం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. డిసెంబర్ వరకు గడువు ఉన్నప్పటికీ ఆరు నెలల ముందుగానే నిర్మాణ పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.

దేశంలోనే ఇంత తక్కువ సమయంలో నిర్మాణం పూర్తిచేసుకున్న విమానాశ్రయం ఇదేనని, ఇచ్చిన మాట ప్రకారం కేవలం రెండేళ్లలోనే ప్రాజెక్టును పూర్తి చేశామని మంత్రి తెలిపారు. అలాగే ఏరో డ్రోన్ లైసెన్స్ కూడా ఈ రోజే లభించిందని వెల్లడించారు.

విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి  చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించామని, ఇందుకోసం ప్రధాని అపాయింట్‌మెంట్ కోరామని చెప్పారు. అపాయింట్‌మెంట్ లభించిన వెంటనే విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని నిర్వహిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.