BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 29 July 2026, 07:23 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బొల్లేరు చెరువు సమీపంలో పెద్దపులి కలకలం.. అప్రమత్తమైన అటవీశాఖ

ఆంధ్రప్రదేశ్
/ తూర్పు గోదావరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 07:23 AM
62 వీక్షణలు

బొల్లేరు చెరువు సమీపంలో పెద్దపులి కలకలం.. అప్రమత్తమైన అటవీశాఖ

తూర్పుగోదావరి జిల్లాలో కరిచర్లగూడెం–గోపాలపురం గ్రామాల మధ్య బొల్లేరు చెరువు సమీపంలో పెద్దపులి సంచారం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. నందిగూడెం అటవీ ప్రాంతం నుంచి తొక్కిరెడ్డిగూడెం, కరిచర్లగూడెం మీదుగా బొల్లేరు చెరువు పరిసరాలకు పెద్దపులి చేరినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.

మార్గమధ్యలో ఒక దూడను చంపి కొబ్బరి, కోకో తోటలోకి లాక్కెళ్లిన ఆనవాళ్లు కనిపించడంతో అధికారులు తోటను పూర్తిగా చుట్టుముట్టారు. పెద్దపులిని సురక్షితంగా బంధించేందుకు మత్తు ఇంజక్షన్, బోను, డ్రోన్ల సాయంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.

ఈ ఆపరేషన్‌లో శ్రీశైలం టైగర్ టీం, తూర్పుగోదావరి జిల్లా హనుమన్ టీంతో పాటు ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చిన సుమారు 60 మంది అటవీశాఖ సిబ్బంది ఐదు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా అధికారుల సూచనలు పాటించాలని అటవీశాఖ విజ్ఞప్తి చేసింది.