BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 03 June 2026, 05:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

బూరుగుగూడెం బాధిత కుటుంబానికి అండగా సీఎం రిలీఫ్ ఫండ్.. రూ.1.50 లక్షల చెక్కు అందజేసిన మంత్రి కొలుసు పార్థసారథి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 05:38 PM
194 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడులోని మంత్రివర్యుల కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన వడ్లమూడి రామచంద్రరావుకు రూ.1.50 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కును రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు.

అనారోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి ఈ సహాయం కొంత ఊరటనివ్వనుందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం అండగా నిలవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.

చెక్కు అందుకున్న వడ్లమూడి రామచంద్రరావు కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వానికి, మంత్రి కొలుసు పార్థసారథికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు జనసేన నాయకులు తుమ్మల జగన్, వెల్లంకి శ్రీమన్నారాయణ, పాశం నాగబాబు పాల్గొని బాధిత కుటుంబానికి తమ సంఘీభావాన్ని తెలియజేశారు. సీఎంఆర్ఎఫ్ వంటి సంక్షేమ కార్యక్రమాలు ఆపదలో ఉన్న కుటుంబాలకు పెద్ద దిక్సూచిగా నిలుస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు.